
మియాపూర్లో CA Student అనుమానాస్పద మృతి.. గదిలో రక్తపు మరకలు కలకలం
హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో ఓ CA Student అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలోని ఓ అద్దె గదిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనార్ధన్ అనే యువకుడు Chartered Accountancy చదువుతున్నాడు. అతను మియాపూర్లోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చదువులు కొనసాగిస్తున్నాడు. అయితే శుక్రవారం గదిలో ఉరి వేసుకున్న స్థితిలో అతడు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించగా.. మృతదేహంపై రక్తపు మరకలు కనిపించినట్లు సమాచారం. దీంతో ఇది నిజంగా Suicideనా? లేక Murder చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గదిలోని పరిస్థితులు, Call Data, Personal Details ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో మియాపూర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి మృతి వెనుక అసలు కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.





