తిరుపతిలో అగ్ని ప్రమాదం, లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో చెత్త కుప్పల్లో మంటలు.




తిరుపతి, ఫిబ్రవరి 18: తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ వద్ద, తిరుచానూరు నుంచి తిరుపతి వైపు వచ్చే రహదారి పక్కన చెత్త కుప్పలు, పాత టైర్ల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.



Post a Comment

Previous Post Next Post